యాప్నగరం

Chandrabau Nephew: చంద్రబాబు మేనల్లుడి అంత్యక్రియలు పూర్తి

ఏపీ సీఎం చం‍ద్రబాబు నాయుడు సోదరి హైమాతి కుమారుడు ఉదయ్‌ కుమార్‌ అంత్యక్రియలు చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో అశ్రునయనాల మధ్య జరిగాయి.

Samayam Telugu 15 Dec 2018, 6:15 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌ కుమార్‌(43) అంత్యక్రియలు చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో అశ్రునయనాల మధ్య జరిగాయి. మంత్రి నారా లోకేష్‌, సినీ నటుడు నారా రోహిత్‌ పాడె మోసి ఉదయ్‌కి తుది వీడ్కోలు పలికారు. వీరితో పాటు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా ఇందిర, నారా బ్రాహ్మణి, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నేతలు ఉదయ్ కుమార్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.
Samayam Telugu Chandrababu


సీఎం చంద్రబాబు సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌ కుమార్‌ శుక్రవారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఉదయ్‌ భౌతికకాయాన్ని కందులవారిపల్లెకు తరలించారు. నేటి ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రేణిగుంట చేరుకున్నారు. అక్కడినుంచి కందులవారిపల్లె చేరుకుని సోదరి హైమావతిని పరామర్శించారు. ఉదయ్ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు.

అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాలతో ఉదయ్‌ కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సోదరి హైమావతి ఇంటికి వెళ్లి ఆమెను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రాజధాని అమరావతికి చంద్రబాబు బయలుదేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.