యాప్నగరం

తెలంగాణ ప్రాజెక్టులు విభజన చట్టానికి వ్యతిరేకం -ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ఎద్దడి, కరువు పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్

Samayam Telugu 2 May 2016, 8:00 pm
ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ఎద్దడి, కరువు పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీడియాకు వెల్లడించిన అంశాల్లో ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. * ఈ ఏడాది 5 వేల కి.మీ మేర సిమెంట్ రోడ్ల విస్తరణ * ఉపాధి హామీ కూలీని రూ.160 నుంచి రూ.190కి పెంపు * 850 గ్రామాలకి ట్యాంకర్లతో నీటి సరఫరా * పశుగ్రాసానికి రూ. 32 కోట్లు విడుదల * కరవు నివారణకి నీరు-చెట్టుకు ప్రాధాన్యత * మున్సిపాల్టీల్లో నీటి సరఫరాకి రూ. 41 కోట్లు విడుదల * 40 వేల చెరువుల్లో పూడికతీతకి ప్రాధాన్యతతోపాటు 2వేల చెరువుల అనుసంధానం * రుణ విముక్తి కింద రూ. 23,150 కోట్లు విడుదల. వడ్డీతో సహా రుణాల చెల్లింపులు. * 8.50 లక్షల పంట కుంటలు తవ్వేందుకు ప్రణాళికలు
Samayam Telugu ap cm chandrababu naidu press meet after state cabinet meeting
తెలంగాణ ప్రాజెక్టులు విభజన చట్టానికి వ్యతిరేకం -ఏపీ సీఎం


విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నారు. క్రిష్ణా, గోదావరి ప్రాజెక్టుల రీ ఆగ్రనైజేషన్ ప్రకారం బోర్డు ఏర్పాటు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలి. క్రిష్ణా నీటిలో 66 టీఎంసీల నీరు మాత్రమే వచ్చాయి. గోదావరి నీటిని ఎలా వాడుకోవాలో తేల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. రెండు రాష్ట్రాలకి ఆమోదయోగ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.