యాప్నగరం

రోడ్లు పూడ్చిన చేతులివి: చంద్రబాబు

లెక్చరర్‌గా వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకున్నారు? ఆయన చిన్నప్పుడు ఊరి మేలు కోసం ఏం చేశారు? ఇంకా ఆయన ఏం చెప్పారో చూడండి.

TNN 27 Feb 2018, 11:07 pm
‘‘బాల్యం నుంచి నేను కొత్తగానే ఆలోచించేవాడిని. అలాగని నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడం లేదు. సమస్య పరిష్కారం కోసం.. కొత్త మార్గాలు అన్వేషించడం నాకు అలవాటు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి గుర్తుచేసుకున్నారు.
Samayam Telugu ap cm chandrababu remembers his old memories
రోడ్లు పూడ్చిన చేతులివి: చంద్రబాబు


‘‘మా ఊరికి ఓ ప్రైవేటు బస్సు వచ్చి పోయేది. రోడ్లు బాగాలేదని రావడం మానేసింది. దీంతో, అంతా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సమష్టి కృషితోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఇంటికి ఒకరిని ఎడ్ల బండిపై రావాలని కోరాను. అంతా కలిసి రాళ్లతో రోడ్ల గుంతలు పూడ్చాము’’ అని తెలిపారు. అదే, నేను చిన్న పిల్లాడిని, ఊర్లో వారు నా మాట వింటారా’ అని ఆలోచించి ఆగిపోతే పని జరిగేదా? ప్రయత్నం చేశాను. ఫలితం వచ్చింది’’ అని పేర్కొన్నారు.

విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ.. ‘‘తొలిసారిగా యూనివర్శిటీ రాజకీయాల్లోకి వచ్చి సామాజిక న్యాయం చేశా. అది నా తొలి విజయం. పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత నాకు యూనివర్శిటీకి లెక్చరర్ పోస్ట్ ఇస్తామన్నారు. కానీ, నేను తిరస్కరించాను. ఎందుకంటే, అప్పట్లో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనే సంకల్పం ఉండేది. ఐఏఎస్, ఆలిండియా సర్వీసెస్ పరీక్షలు రాయాలనే ఒపిక కూడా నాకు అప్పట్లో లేదు. రాసినా పాసవుతాననే నమ్మకం ఉండేది కాదు. రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయాలని భావించా’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.