యాప్నగరం

నోట్ల కష్టాలు తాత్కాలికమే: చంద్రబాబు

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా.. దీని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే విచారకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

TNN 27 Nov 2016, 11:53 am
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా.. దీని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే విచారకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కడప జిల్లాలో శనివారం పర్యటించిన బాబు అక్కడ నిర్వహించిన జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. నోట్ల రద్దు వల్ల దేశానికి మేలు చేకూరుతుందన్నారు. నోట్ల రద్దు వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పెద్దగా లెక్కింపదగినవి కాదని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
Samayam Telugu ap cm chanrdababu naidu takes part in janachaitanya yatra in kadapa district
నోట్ల కష్టాలు తాత్కాలికమే: చంద్రబాబు


రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల గురించి చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా పలు చోట్ల ప్రస్తావించారు. దాని ప్రాధాన్యత గురించి వెళ్లిన ప్రతీ చోట వివరించి చైతన్యం కలిగించే యత్నం చేశారు. నిరుపేదలను మభ్యపెట్టిన నల్ల కుబేరులు తమ సొమ్మును వారి ఖాతాల్లో జమచేసేందుకు ప్రయత్నిస్తున్నారని , వారి వలలో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. దీని వల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్నారు. అలాగే, డ్వాక్రా మహిళలు మొబైల్ బ్యాంకింగ్ లాంటి అంశాల్లో అవగాహన పెంచుకుని ఇతర రాష్ట్రాల మహిళల కన్నా ముందుండాలని బాబు పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.