యాప్నగరం

ఏపీలో చంద్రన్న కానుకలు వచ్చేశాయ్..

క్రైస్తవుల సంక్షేమానికి తన ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

TNN 21 Dec 2016, 8:21 am
క్రైస్తవుల సంక్షేమానికి తన ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలో చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. గన్నవరంలోని ఎనికేపాడు ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు మతపెద్దల సమక్షంలో చంద్రబాబు నాయుడు క్రిస్మస్ కానుకలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశాభివృద్ధిలో, సమాజ సంక్షేమంలో క్రైస్తవ మిషనరీల సేవలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. నిరుపేదలకు మూడు పూటలా వేళకు కడుపు నిండుగా భోజనం లభించేలా వారి సంక్షేమానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు.
Samayam Telugu ap cm distributes chandranna christmas kanukalu in vijayawada
ఏపీలో చంద్రన్న కానుకలు వచ్చేశాయ్..


జనవరి 2వ తేదీ నుండి ఏపీ వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎప్పటిమాదిరిగానే ఆయా సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులకు జన్మభూమి కార్యక్రమంలో ఫించన్లు ఇతర ప్రయోజనాలను అందచేస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.