యాప్నగరం

ఏపీలో వెయ్యికోట్లతో క్యాడ్‌బరీ ప్లాంట్ ఏర్పాటు !

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుతో గురువారం క్యాడ్‌బరీ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు.

TNN 17 Mar 2016, 3:58 pm
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుతో గురువారం క్యాడ్‌బరీ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు కోరారు. సీఎం అభ్యర్థన మేరకు చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రూ.1000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చారు.. దీని కోసం 130 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్థత వ్యక్తం చేసినట్లు సమాచారం. క్యాడ్ బరీ చాకెట్లు, బిస్కట్లు, గమ్ అండ్ క్యాండీ, క్యాడ్ బరీ డెయిరీ మిల్స్, జెమ్స్ తదితర ఉత్సత్తుల కోసం ప్లాంట్ నిర్మాణం చేయనున్నారు.
Samayam Telugu ap cm meet to representatives of cadbury company
ఏపీలో వెయ్యికోట్లతో క్యాడ్‌బరీ ప్లాంట్ ఏర్పాటు !


క్యాడ్‌బరీ ప్రతినిధులతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ క్యా ఏపీలో క్యాడ్‌బరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే కోకో పంటలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొబ్బరి , పామాయిల్ తోటల్లో ప్రథమంగా అంతర్ పంటగా కోకో సాగు చేపట్టాలని రైతులకు చంద్రబాబు సూచించారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో ఉన్న సాగును మరింత పెంచెలా రైతుల్ని ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.