యాప్నగరం

2019లో బీజేపీకి ఒక్క సీటొచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: డిప్యూటీ సీఎం కేఈ

రాబోయే ఎన్నిల్లో బీజేపీకి ఒక్క సీటొచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచారు.

Samayam Telugu 23 Jul 2018, 11:08 am
రాబోయే ఎన్నిల్లో బీజేపీకి ఒక్క సీటొచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచారు. లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ చెప్పినవన్నీ అబద్దాలేనని.. హామీలపై చంద్రబాబు కాదు మోదీనే యూ టర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. వాటిని నేరవేర్చకుండా ఏపీ ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు.
Samayam Telugu KE


రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు కేఈ. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని.. బీజేపీ ఏపీలో ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఇటు జగన్, పవన్‌ల తీరుపై డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిపై ఆ ఇద్దరికి చిత్తశుద్ధి లేదని.. జగన్ వీధుల్లో తిరుగుతుంటే.. పవన్ ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం టీడీపీ ధర్మ పోరాటం కొనసాగుతుందన్నారు కేఈ. దీనికోసం ఎంత దూరమైనా వెళతామని.. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.