యాప్నగరం

సోషల్ మీడియాపై కేఈ ఆసక్తికర వ్యాఖ్యలు!

అమరావతి వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో ఏపీ-ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ రంగంలో కీలకమైన భూ సంస్కరణలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.

Samayam Telugu 8 May 2018, 12:46 pm
అమరావతి వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో ఏపీ-ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ రంగంలో కీలకమైన భూ సంస్కరణలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. చట్టపరమైన హక్కుల సాధన కోసమే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో పోరాటం చేస్తున్నారని, దీనికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కేఈ కోరారు. నేటి రాజకీయ పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని, దేశ రాజకీయాలను సామాజిక మాధ్యమాలు ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాలను అమలు చేయడానికి ఆసక్తిచూపకపోవడం, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి కృష్ణమూర్తి ఆరోపించారు.
Samayam Telugu ఏపీ డిప్యూటీ సీఎం


పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్ధాయిలో సమర్ధవంతంగా అమలుపరిచే బాధ్యతను కలక్టర్లే తీసుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం ఉద్ఘాటించారు. రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, అన్ని రకాల భూములను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు భూ సేవ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. అలాగే ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యతో భూధార్ కేటాయిస్తామని, భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులున్నాయని, 8.5 లక్షల గ్రామీణ ఆస్తులకు భూ-ధార్ కేటాయిస్తున్నామని కేఈ తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.