యాప్నగరం

స్కూల్, ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. అమ్మఒడిపై క్లారిటీ

అమ్మ ఒడి పథకంపై అసెంబ్లీలో ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు. జనవరి 26 నుంచి ప్రారంభం.

Samayam Telugu 11 Jul 2019, 3:23 pm
అమ్మ ఒడి పేరుతో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులతో పాటూ ఇంటర్ విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2020 జనవరి 26 నుంచి 'అమ్మ ఒడి' పథకం ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. అసెంబ్లీలో పథకానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామన్నారు.
Samayam Telugu suresh


సీఎం వైఎస్ జగన్ విద్యాశాఖపై ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు మంత్రి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తామని.. రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేస్తామన్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా.. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామని.. 'రాజన్న బడిబాట' ద్వారా విద్యార్థులు బడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విద్యాహక్కు చట్టంలో భాగంగా.. ప్రైవేట్ స్కూళ్లలో 25శాతం ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ 25శాతంలో అనాథ పిల్లలకు ఐదు శాతం, గిరిజన పిల్లలకు ఐదు శాతం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి అందిస్తామన్నారు. అర్బన్‌ ఏరియాలో ప్రతి నెల రూ.70 ఫీజు ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.