యాప్నగరం

జగన్ ఛాంబర్‌లో పైప్ లీకేజీ, సీఐడీ విచారణ

‘ఎవరి ప్రమేయం లేకుండా ఏసీ పైపు ఏ రూపంలో కట్‌ అవుతుంది? ఎలా జరిగిందనేది తేలాల్సి ఉంది

Samayam Telugu 7 Jun 2017, 4:23 pm
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీరు చేరడం వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. బుధవారం కురిసిన వర్షపు కేవలం ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి మాత్రమే చేరడం పలు అనుమానాలు తావిస్తోంది. దీనికితోడు.. భవనంపై ఓ పైపు కట్ చేసి ఉండటం ఈ అమానాలను బలం చేకూరుస్తోంది.
Samayam Telugu ap govt orders cid probe into pipe leakage of jagans chamber
జగన్ ఛాంబర్‌లో పైప్ లీకేజీ, సీఐడీ విచారణ

అయితే వర్షం నీరు ఎలా వచ్చిందో తేల్చడానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఐడీ విచారణకు ఆదేశించారు. బుధవారం ఆయన అసెంబ్లీ భవానికి వెళ్లి లీకేజీ జరిగిన జగన్ ఛాంబర్, పరిసర ప్రదేశాలను పరిశీలించారు.
‘అసెంబ్లీ భవనం ప్రారంభించి నాలుగు నెలలైంది.ఈ భవనంలోనే అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలోనే పెద్ద వర్షం పడింది. ఆ తర్వాత కూడా వర్షాలు పడ్డాయి. నిన్న (బుధవారం) కురిసిన వర్షానికి ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్‌లోకి మాత్రమే నీళ్లు వెళ్లాయి. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు నడవని రోజుల్లో కేవలం ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే ఇక్కడకు వస్తారు. మిగతావారిని రానీయం’ అని కోడెల మీడియాకు తెలిపారు.

భవనంపై ఎవరో పైప్‌ను కట్‌చేసినట్టు గుర్తించామని.. అలా పైప్‌ను కట్‌చేయడం వల్లే ప్రతిపక్ష నేత జగన్ గదిలోకి నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు.
‘ఎవరి ప్రమేయం లేకుండా ఏసీ పైపు ఏ రూపంలో కట్‌ అవుతుంది? ఎలా జరిగిందనేది తేలాల్సి ఉంది. అందుకే దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించాం’ అని కోడెల స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.