యాప్నగరం

కనీవినీ ఎరగని స్థాయిలో వెంకయ్యకు సన్మానం

భారీ స్థాయిలో ఏర్పాట్లు..

TNN 26 Aug 2017, 9:11 am
ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి సొంత రాష్ట్రంలో అడుగుపెడుతున్న వెంకయ్యనాయుడుకు అంగరంగ వైభవంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది ఏపీ ప్రభుత్వం. భారీ స్థాయిలో పౌరసన్మానానికి సర్వం సిద్ధమైంది. కనీవినీ ఎరగని రీతిలో వెంకయ్యను ఏపీ ప్రభుత్వం సత్కరిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.
Samayam Telugu ap govt to fecilitate venkaiah in grand manner
కనీవినీ ఎరగని స్థాయిలో వెంకయ్యకు సన్మానం


లక్షమందితో మానవహారం ఏర్పాటుతో ఏపీ ప్రభుత్వం వెంకయ్యకు స్వాగతం పలుకుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ ఈ మానవహారాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీ స్థాయిలో రోడ్ షో సాగనుంది. రోడ్డుకు ఇరువైపులా.. వెంకయ్యకు స్వాగతం పలుకుతూ మానహారం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డెబ్బై వేల మంది విద్యార్థులను, ముప్పై వేల మంది డ్వాక్రా మహిళలను సిద్ధం చేసినట్టు సమాచారం. వీళ్లంతా పూలు చల్లుతూ వెంకయ్యకు స్వాగతం పలుకుతారు.

రోడ్ షో నేపథ్యంలో ఈ రోడ్డుపై ట్రాఫిక్ ను కూడా దారి మళ్లించారు. వెంకయ్యకు పౌర సన్మాన ఏర్పాట్లను గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. వెలగపూడి వద్ద సన్మాన వేదిక సిద్ధం అయ్యింది. ఉదయం ఆరు గంటల నుంచినే వెంకయ్య రోడ్ షో సాగే దారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.