యాప్నగరం

108ను పిలిచి, ఆస్పత్రికి పంపి.. ఏపీ మంత్రి పెద్ద మనసు

మంత్రి తన సొంత నియోజకవర్గానికి వెళుతుండగా.. మార్గమధ్యలో బైక్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే కాన్వాయ్ ఆపి బాధితులకు సాయం చేసిన పెద్ద మనసు చాటుకున్నారు.

Samayam Telugu 14 Jul 2019, 4:06 pm
రోడ్డు ప్రమాదంలో గాయడిన బాధితులకు అండగా నిలిచారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. చిన్న గాయాలు తగలడంతో.. వెంటనే డాక్టర్‌ను పిలిపించి వైద్యం చేయించారు. గాయపడిన వారికి ధైర్యం చెప్పి.. ఆయనే స్వయంగా 108కి ఫోన్ చేశారు.. వాహనం అక్కడికి చేరుకునే వరకు ఆగారు. బాధితుల్ని దగ్గరుండి వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి పంపే వరకు అక్కడే ఉన్నారు. తన పెద్ద మనసు చాటుకొని.. అందరి ప్రశంసలు పొందుతున్నారు.
Samayam Telugu suresh.


మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం అమరావతి నుంచి తన సొంత నియోజకవర్గమైన యర్రగొండపాలెం బయల్దేరారు. మంత్రి కాన్వాయ్ గుంటూరు జిల్లా కోటప్పకొండ దగ్గరకు రాగానే.. రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. భార్యాభర్తలు బైక్‌పై వెళుతుండగా జారిపడ్డారు.. బైక్ బోల్తాపడటంతో గాయాలయ్యాయి. వెంటనే మంత్రి తన కాన్వాయ్‌ను ఆపారు. ప్రమాదం గురించి ఆరా తీశారు.

భార్యాభర్తలకు చిన్న, చిన్న గాయాలు కావడంతో..వెంటనే డాక్టర్‌ను అక్కడికి పిలిపించారు. ఈలోపే 108 వాహనానికి స్వయంగా ఫోన్ చేశారు. బాధితులకు ప్రథమ చికిత్స అందించిన తర్వాత 108 అక్కడి చేరుకోగా.. వారిని వాహనంలో ఆస్పత్రికి పంపించే వరకు అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి యర్రగొండ పాలెం బయల్దేరి వెళ్లారు. మంత్రి మంచి పని చేశారంటూ నెటిజన్లతో పాటూ స్థానికులు ప్రశంసలు కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.