యాప్నగరం

పెళ్లికి రండి: కేటీఆర్‌కు అఖిలప్రియ ఆహ్వానం..!

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మంత్రి కేటీఆర్‌ను గురువారం (మే 24) కలిశారు. అఖిల ప్రియ తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి వచ్చి, తమ వివాహానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.

Samayam Telugu 25 May 2018, 11:09 am
ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మంత్రి కేటీఆర్‌ను గురువారం (మే 24) కలిశారు. అఖిల ప్రియ తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి వచ్చి, తమ వివాహానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులను కేటీఆర్ అభినందించారు. వారికి జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖిలప్రియ తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తాను 2009-2014 మధ్య శాసనసభ్యులుగా పనిచేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
Samayam Telugu KTR


మే 12న అఖిలప్రియ నిశ్చితార్థం పారిశ్రామికవేత్త భార్గవ్‌తో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 29న అఖిలప్రియ వివాహం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.