యాప్నగరం

ఘనంగా మంత్రి పరిటాల సునీత కుమార్తె వివాహం

ఏపీ మంత్రి పరిటాల సునీత కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. మేళ తాళాలు, అర్చకుల వేద మంత్రాల మధ్య వడ్లమూడి శ్రీహర్ష, స్నేహలతలు ఒక్కటయ్యారు.

Samayam Telugu 6 May 2018, 5:59 pm
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. మేళ తాళాలు, అర్చకుల వేద మంత్రాల మధ్య వడ్లమూడి శ్రీహర్ష, స్నేహలతలు ఒక్కటయ్యారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగిన వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటూ బంధువులు, పరిటాల అభిమానులు తరలివచ్చి... నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతిథుల్ని మంత్రి పరిటాల సునీత దగ్గరుండి ఆహ్వానం పలికారు. వివాహ వేడుక కోసం వెంకటాపురంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భారీ సెట్టింగ్‌తో వివాహ వేదికను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం ప్రత్యేకంగా చలువ పందిళ్లను వేశారు. దాదాపు 30వేల మంది వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu Sneha


వరుడు శ్రీహర్ష పరిటాల రవీంద్ర సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు. హర్ష ప్రస్తుతం సొంత వ్యాపారాలు చూసుకుంటుండగా...స్నేహలత డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌‌ను పూర్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.