యాప్నగరం

జగన్, పవన్‌పై మంత్రి సోమిరెడ్డి విమర్శలు..

వైసీపీ అధినేత జగన్, జనసేన సారథి పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత జగన్ లక్ష్యంగా విరుచుకు పడ్డారు.

Samayam Telugu 24 Jul 2018, 6:34 pm
వైసీపీ అధినేత జగన్, జనసేన సారథి పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత జగన్ లక్ష్యంగా విరుచుకు పడ్డారు. మంగళవారం (జులై 24) విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ తరచూ బంద్‌లకు పిలుపు నివ్వడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పోరాడాల్సిన ఎంపీలు ఇళ్లల్లో కూర్చున్నారని.. ప్రజా సమస్యలపై చర్చ వదిలిపెట్టి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Samayam Telugu somireddy


బంద్‌ల ద్వారా రాష్ట్రాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని సోమిరెడ్డి అన్నారు. ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి రూ.190 కోట్లు నష్టమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే దమ్ము లేకనే.. జగన్ రాష్ట్రంలో బంద్‌లకు పిలుపునిస్తున్నారన్నారు. జగన్ చర్యలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం కేంద్రంతో జగన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు.

జనసేన పార్టీ రాజకీయాలు ఏ ఒక్కరికీ అర్థంకావడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. పవన్ సినిమాల్లో మంచి హీరోనే... కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన తీరు అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.