యాప్నగరం

సచివాలయంలోకి నీరు, విధులకు ఆటంకం

భారీ వర్షం అమరాతిని అతలాకుతలం చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Samayam Telugu 6 Jun 2017, 5:07 pm
భారీ వర్షం అమరాతిని అతలాకుతలం చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఏపీ సచివాయంలోకి వర్షపు నీరు చేరింది. అసెంబ్లీ, సచివాలయంలోని పలు ఛాంబర్లలోకి వర్షపు నీరు చేరింది. రెవెన్యూ బ్లాకులోకి వర్షపు నీరు చేరడంతో విధులకు ఆటంకం కలిగింది.
Samayam Telugu ap secretariat affected by heavy rain
సచివాలయంలోకి నీరు, విధులకు ఆటంకం


గుంటూరులోని సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి చెట్లు నెలకూలాయి. రేకుల షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.