యాప్నగరం

ఐ యామ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్నారు: ఎంపీల బృందం

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. విభజన చట్టం హామీలతో పాటు పెండింగ్ అంశాలపై తనను కలిసిన ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలకు ప్రధాని భరోసా ఇచ్చారు.

TNN 5 Jan 2018, 8:59 pm
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. విభజన చట్టం హామీలతో పాటు పెండింగ్ అంశాలపై తనను కలిసిన ఏపీ ఎంపీలకు ప్రధాని ఈ మేరకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎంపీలు శుక్రవారం (జనవరి 5) సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. విభజన చట్టం హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, ఇతర పెండింగ్‌ అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రను ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
Samayam Telugu ap tdp and bjp mps meet pm modi in delhi
ఐ యామ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్నారు: ఎంపీల బృందం


వివిధ అంశాలను నిర్దేశిత కాల పరిమితిలోగా పూర్తి చేయడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానిని ఎంపీల బృందం కోరింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ప్రధాని సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రైల్వే జోన్, విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి హామీ ఇచ్చారని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.

ఏపీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని తెలిపారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ‘ఐ యామ్ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అని ప్రధాని అన్నారని ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సీఎం చంద్రబాబుతో సమావేశమవుతున్నట్లు మోదీ చెప్పారని సీఎం రమేష్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.