యాప్నగరం

ఏపీలో క్యాష్‌లెస్ గ్రామంగా ద్వారపూడి

ఏపీలో మరో గ్రామం క్యాష్ లెస్ విలేజ్ (నగదు రహిత లావాదేవీల గ్రామం)గా గుర్తింపు పొందింది

TNN 20 Dec 2016, 9:58 am
ఏపీలో మరో గ్రామం క్యాష్‌లెస్ విలేజ్ (నగదు రహిత లావాదేవీల గ్రామం)గా గుర్తింపు పొందింది. విజయనగరం జిల్లాలోని ద్వారపూడిని డీటీఈ మోడల్ విలేజ్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటించారు. ఈ గ్రామాన్ని మంత్రి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపు మేరకు ఈ గ్రామంలో నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడంలో అధికారులు విజయవంతం అయ్యారు. ప్రస్తుతం ఈ గ్రామంలో నూటి 95శాతం వరకు లావాదేవీలు డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయని వారు చెప్పారు.
Samayam Telugu ap village dwarapudi becomes cashless transaction village
ఏపీలో క్యాష్‌లెస్ గ్రామంగా ద్వారపూడి


సోమవారం నాడు అశోక్ గజపతి రాజు ద్వారపూడిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తన స్మార్ట్‌ఫోన్లోని ఎస్.బి.ఐ. బడ్డీ యాప్ ద్వారా స్థానిక కిరాణాషాపులో వాటర్ బాటిల్, చాక్లెట్లు కొనుగోలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.