యాప్నగరం

రిసార్ట్ దీక్షలు కొత్త ఫ్యాషనేమో.. పవన్ దీక్షపై అశోక్‌ గజపతిరాజు!

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు దీక్షపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 26 May 2018, 2:09 pm
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు దీక్షపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు విమర్శలు గుప్పించారు. పవన్ దీక్షపై స్పందించిన ఆయన శనివారం (మే 16) మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్‌ ఎమర్జెన్సీ ఉంటే ఆసుపత్రిలో దీక్ష చేయాలి కానీ, ఇలా రిసార్ట్‌‌లో కాదని అన్నారు. తొలిసారిగా రిసార్ట్‌‌లో దీక్ష చేయడం చూస్తున్నానని.. ఇది కొత్త ఫ్యాషనేమో అని పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Samayam Telugu ashok


ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై అపవాదులు వేయడం సరికాదని అశోక్‌ గజపతిరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకిచ్చే పింఛన్‌ డబ్బులు కూడా బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లేవని.. తమ ప్రభుత్వంలో అలా జరగడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా తమ పార్టీ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. కార్యకర్తలను ఆదుకుంటున్న ఏకైక పార్టీ టీడీపీ అని, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు.

ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమంపై 48 గంటల్లో స్పందించాలని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ రెండురోజుల క్రితం గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒక్కరోజు నిరాహారదీక్ష చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు శుక్రవారం (మే 25) ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురంలోని రిసార్ట్‌‌లో సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించిన పవన్.. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ప్రజల మధ్య కూర్చుని దీక్ష కొనసాగిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్ష విరమించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.