యాప్నగరం

Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో ట్విస్ట్.. రికార్డులన్నీ ధ్వంసమయ్యాయన్న సిట్

ఆయేషా మీర హత్యకేసులో కీలక మలుపు.. కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయంటున్న సిట్.. విచారణకు ఆదేశించిన హైకోర్టు..

Samayam Telugu 12 Oct 2018, 6:18 pm
11ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మొదటి నుంచి ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో.. సిట్ మరో షాక్ ఇచ్చింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయంటూ సిట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆయేషా కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సిట్ ఈ విషయాన్ని తెలియజేసింది.
Samayam Telugu Ayesha


విజయవాడ కోర్టలో ఆయేషా మీరా హత్యకేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమైనట్లు సిట్ తెలిపింది. హైకోర్టులో కేసు విచారణ నడుస్తున్న సమయంలోనే ధ్వంసమయ్యాయని తెలిపింది. సీరియస్‌గా స్పందించిన హైకోర్టు.. రికార్డుల ధ్వంసంపై విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల కన్నా సీబీఐ దర్యాప్తు మేలేమోననే అభిప్రాయపడింది. అలాగే సీబీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. 2014లోనే కేసు ఫైల్స్ ధ్వసంమైనట్లు విజయవాడ కోర్టుకు సిట్ తెలియజేసిందట.

007 డిసెంబర్‌లో బీ ఫార్మసీ చదవుతున్న ఆయేషా మీరాను విజయవాడలో ఆమె ఉంటున్న హాస్టల్‌లోనే దారుణంగా హత్య చేశారు. డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు. అక్కడ ఓ లేఖ కూడా బయటపడగా.. అందులో తన ప్రేమను నిరాకరించినందుకు ఆమెను చంపినట్లు రాసి ఉంది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సత్యంబాబు అనే యువకుడ్ని అరెస్ట్ చేయగా.. తర్వాత అతడు నిర్థోషని తేలడంతో విడుదలయ్యాడు.

సత్యంబాబు విడుదల కావడంతో ఈ కేసు వ్యహారం మళ్లీ మొదటికి వచ్చింది. అసలు దోషులెవరో కూడా తేలలేదు. దీంతో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. అయితే ఈ సిట్ దర్యాప్తుపై ఆయేషా తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.