యాప్నగరం

ఏపీ ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వస్తారా?

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విషయంలో ఆసక్తికరమైన ప్రచారం

TNN 20 Oct 2017, 11:49 am
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన జరగనున్నదని, అప్పుడు చంద్రబాబు నాయుడు యనమలను తప్పించనున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలో అత్యంత సీనియర్ లీడర్లలో ఒకరైన యనమల స్థానంలో చంద్రబాబు కొత్త ఆర్థిక శాఖ మంత్రిని నియమించుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలే లక్ష్యంగా కూర్చబోయే కేబినెట్ లో యనమలకు స్థానం లభించడం కష్టమే అని ఇప్పుడు టాక్.
Samayam Telugu babu cabinet reshuffle yanamala will be out
ఏపీ ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వస్తారా?


అయితే యనమలను అలా వదిలేయడం లేదట, ఆయనను రాజ్యసభకు పంపనున్నారట చంద్రబాబు నాయుడు. త్వరలోనే ఏపీ కోటాలో రాజ్యసభ ఎన్నికలు రానున్నాయి. వాటిల్లో టీడీపీ వాటాగా రెండు సీట్లు దక్కుతాయి. ఆ సమయంలో యనమలకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే యనమల ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. క్రితం సారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆశించిన స్థాయిలో యనమల పని చేయడం లేదని.. అందుకే ఈ మార్పు ఉండబోతోందని ఏపీ తెలుగుదేశం వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. అయితే పార్టీ సీనియర్ అనే గౌరవంతో బాబు యనమలకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వనున్నారట. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ ఏమీ లేదు. ఈ ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.