యాప్నగరం

ప్రొఫెసర్ లక్ష్మికి బెయిలు నిరాకరణ!

సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలైన ప్రొఫెసర్ లక్ష్మికి ఎదురుదెబ్బ తగిలింది.

TNN 9 Nov 2016, 7:24 pm
మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలైన ప్రొఫెసర్ లక్ష్మికి ఎదురుదెబ్బ తగిలింది. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచి లక్ష్మి పరారీలో ఉంది. అజ్ఞాతంలో ఉండే బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఆమెకు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది.
Samayam Telugu bail plea of professor lakshmi rejected
ప్రొఫెసర్ లక్ష్మికి బెయిలు నిరాకరణ!


సంధ్యారాణి గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. గతేడాది డిసెంబర్లోనే ఆమెకు పెళ్లయ్యింది. కాగా సంధ్యారాణిని గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ లక్ష్మి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సున్నిత మనస్కురాలైన సంధ్య ఆమె వేధింపులు భరించలేక గత నెలలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని భర్త డాక్టర్ రవి కూడా ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్ని రోజులైనా నిందితురాలైన లక్ష్మిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ కూడా లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాని ఆత్మహత్య చేసుకున్నట్టు ధ్రువీకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.