యాప్నగరం

బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో విలన్ ఆమేనట?

తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మిస్తానని హీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.

TNN 7 Feb 2017, 12:51 pm
తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మిస్తానని హీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో తానే హీరోగా నటిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించిన తర్వాత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్టీఆర్ సినిమాలో విలన్ లక్ష్మీపార్వతేనంటూ తెలుగుదేశం ఎంఎల్ఏ బొండా ఉమ అన్నారు. ఆమె చేతుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఏనాడో మూతపడి ఉండేదని ఉమ వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన లక్ష్మీపార్వతి ఆరోపణలను కొట్టిపారేశారు.
Samayam Telugu balakrishna announces biopic on illustrious life of father ntr
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో విలన్ ఆమేనట?


ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా ఉంటే సహించేది లేదని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా చూపించాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రంలో చంద్రబాబును హీరోగా చూపిస్తే తాను న్యాయపోరాటానికి కూడా వెనుకాడనని ఆమె హెచ్చరించారు. దివంగత నేత ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బాలయ్య తన తండి జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని ప్రకటించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.