యాప్నగరం

వచ్చే ఎన్నికల్లో బాలయ్య పోటీపై లభించిన స్పష్టత

2019 ఎన్నికల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే...

Samayam Telugu 26 Jun 2017, 10:14 pm
2019 ఎన్నికల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలని ఆయన కొట్టేశారు. తాజాగా హిందూపురంలో జరిగిన ఓ సమావేశంలో మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. ''ఈసారి రాబోయే ఎన్నికల్లో తాను కృష్ణా జిల్లా గుడివాడ, మైలవరం స్థానాల నుంచి పోటీ చేస్తానని వినిపిస్తున్న ప్రచారం అంతా ఉత్తి అబద్ధమే" అని అన్నారు బాలకృష్ణ. హిందూపురంతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. ఏదేమైనా ఈ సారి కూడా తాను హిందూపురం నుంచే పోటీ చేయడం ఖాయం అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ స్పష్టతతోనైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి.
Samayam Telugu balakrishna gives clarity about his contestation in 2019 elections
వచ్చే ఎన్నికల్లో బాలయ్య పోటీపై లభించిన స్పష్టత


ఇదిలావుంటే, హిందూపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపనుల గురించి కూడా బాలకృష్ణ మీడియాకు వివరించారు. త్వరలోనే హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి హిందూపురం పరిసరాల్లోని చెరువులకి నీరు అందిస్తామని అన్నారు. రూ. 194 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి నీళ్లు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న పైప్ లైన్ పనులకి సైతం త్వరలోనే టెండర్లు ఆహ్వానించి మరో ఐదు నెలల్లో పనులు పూర్తయ్యేలా చూస్తామని నియోజకవర్గ ప్రజలకి హామీ ఇచ్చారు బాలయ్య.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.