యాప్నగరం

బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది: వెంకయ్య

రాజ్యాంగ విలువలు కాపాడటంలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైకోర్టులో సోమవారం (నవంబర్ 20) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బార్ ఆసోసియేషన్ల ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడికి సన్మానం చేశారు.

TNN 20 Nov 2017, 8:39 pm
రాజ్యాంగ విలువలు కాపాడటంలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైకోర్టులో సోమవారం (నవంబర్ 20) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బార్ ఆసోసియేషన్ల ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బులెట్ కంటే బ్యాలెట్ గొప్పదని, గూగుల్ కంటే గురువు గొప్పవాడని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను గమనిస్తే.. ఈ విషయం సులువుగానే అర్థమవుతుందని ఆయన అన్నారు. కులం, మతం, ధనం లాంటి తాత్కాలికంగా ప్రభావితం చేసే అంశాలకు ఓటర్లు లొంగకూడదని.. గుణం, సామర్థ్యం ఆధారంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Samayam Telugu ballet is powerful than bullet says venkaiah naidu
బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది: వెంకయ్య


దేశంలో 67 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్స్‌గా ఉంటున్నారని, న్యాయవాదులు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని వెంకయ్య సూచించారు. అన్నివేళలా ధర్మమే ఆమోదయోగ్యమైందని, ఎవరి పనులను వారు సరిగా నిర్వర్తిస్తే.. సమస్యలు ఉండవని ఆయన చెప్పారు.

మాతృ భాష అమ్మ పాల లాంటిదని, ఇంట్లో అందరూ మాతృ భాషలోనే మాట్లాడలని వెంకయ్య పునరుద్ఘాటించారు. తెలుగులో కొన్ని పదాలు కనుమరుగయ్యే దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.