యాప్నగరం

18, 19న రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలు..

సెప్టెంబర్ 18,19న రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. పండగ ఏర్పాట్ల ఖర్చుల నిమిత్తం 18లోగా జిల్లాలకు నిధులు అందజేస్తామని సీఎస్ ఎస్‌పీ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో సెప్టెంబర్ 20 నుంచి 28..

TNN 9 Sep 2017, 4:48 pm
సెప్టెంబర్ 18,19న రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కోటి మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పండగ ఏర్పాట్ల ఖర్చుల నిమిత్తం 18లోగా జిల్లాలకు నిధులు అందజేస్తామని సీఎస్ ఎస్‌పీ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో సెప్టెంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న బతుకమ్మ పండగకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 26న ఎల్బీ స్టేడియంలో మెగా బతుకమ్మ ఉత్సవాన్ని 35000 మంది మహిళలతో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. గతేడాది నెలకొల్పిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను తిరగరాస్తామని ఆమె పేర్కొన్నారు.
Samayam Telugu bathukamma sarees distribution on september 18 19 in telangana
18, 19న రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలు..


బతుకమ్మ పండగ ప్రారంభ రోజైన సెప్టెంబర్ 20న సెలవుగా నిర్ణయించారు. సద్దుల బతుకమ్మ పండగ రోజైన 28తో పాటు 29, 30 తేదీలను దసరా సెలవుగా ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.