యాప్నగరం

గద్వాల్ చీరలని రూ.100 చీరలు అంటగడతారా?

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీపై మహిళలు భగ్గుమంటున్నారు. గద్వాల చీరలంటూ టీవీ ఛానెళ్లలో ఊదరగొట్టి, తీరా తమకు రూ.100 చీరలు అంటగడుతున్నారని జగిత్యాల జిల్లాలో మహిళలు మండిపడ్డారు.

TNN 18 Sep 2017, 2:59 pm
తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీపై మహిళలు భగ్గుమంటున్నారు. గద్వాల చీరలంటూ టీవీ ఛానెళ్లలో ఊదరగొట్టి, తీరా తమకు రూ.100 చీరలు అంటగడుతున్నారని జగిత్యాల జిల్లాలో మహిళలు మండిపడ్డారు. ప్రభుత్వం అందించే ఈ రూ.100 చీరల కోసం రూ.300 కూలీ పనులు మానుకుని వచ్చామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబరాల్లో ఈ చీరెలు కట్టుకుని కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత బతుకమ్మ ఆడతదా? అని పలువురు మహిళలు ప్రశ్నించారు. పేద మహిళలంటే అంత చులకనా? కేసీఆర్ సారూ అంటూ వారు నిలదీశారు. 60-70 రూపాయలకు వచ్చే చీరెలను ఎవరైనా పండుగపూట కట్టుకుంటరా? అని వారు మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను రోడ్డుపై వేసి తగులబెట్టి, తమ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Samayam Telugu batukamma sarees distribution womans anger about quality
గద్వాల్ చీరలని రూ.100 చీరలు అంటగడతారా?


బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణలోని పేద మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో చీరల పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ చీరలకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ. 222 కోట్లు ఖర్చుచేసింది. 7 కోట్ల మీటర్ల వస్త్రంతో 500 డిజైన్ల చీరలను రూపొందించారు. మొత్తం 1.45 కోట్ల మంది లబ్దిదారులకు వీటిని అందజేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.