యాప్నగరం

అంజన్న గుడిలో కునుకు తీసిన భల్లూకం

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రవేశించిన ఎలుగుబంటి కాసేపు నిద్రించిన ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్..

TNN 5 Sep 2017, 2:52 pm
దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి అక్కడే ఓ గదిలో నిద్రకు ఉపక్రమించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణ్‌పేట మండలం అయ్యవారిపల్లెలోని హనుమాన్ ఆలయంలోకి ఓ ఎలుగు బంటి ప్రవేశించింది. ఏంచక్కా ఓ గదిలో దూరి కాసేపు రెస్ట్ తీసుకుంది. దాన్ని చూసిన స్థానికులు భయపడ్డారు. దాన్ని పెద్దగా డిస్ట్రబ్ చేయకుండా.. తలుపులు మూసేసి గదిలోనే బంధించారు. విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భల్లూకాన్ని చూడటానికి తరలివచ్చారు. వీరంతా హడావిడి చేయడంతో ఎలుగు నిద్రలేచి అటు ఇటు పరుగులు తీసింది.
Samayam Telugu bear takes a nap in temple room
అంజన్న గుడిలో కునుకు తీసిన భల్లూకం


ఇంతలో ఎలుగు బంటి ఆలయంలోకి చొరబడిందనే సమాచారం అందుకున్న అటీవీ సిబ్బంది బోనులో దాన్ని బంధించి అమ్రాబాద్ అడవుల్లో వదలిపెట్టారు. ఆహారం, నీరు వెతుక్కుంటూ ఎలుగు బంటి అడవి నుంచి ఊళ్లోకి ప్రవేశించి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.