యాప్నగరం

బీరు బాటిళ్ల లారీ బోల్తా..

దారెంట వెళుతున్న మద్యంప్రియులు ఆ దృశ్యం చూసి గుండెలు బాదుకుంటున్నారు..

TNN 5 Aug 2017, 1:33 pm
బీరు బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో సుమారు 1300 కాటన్ల బీరు నేలపాలైంది. ఆ యజమాని పరిస్థితి ఏమిటో తెలియదు గానీ.. దారెంట వెళుతున్న మద్యంప్రియులు ఆ దృశ్యం చూసి గుండెలు బాదుకుంటున్నారు. బీరు బాటిళ్లు తీసుకెళ్లడానికి జనం ఎగబడుతుండటంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. జనగాం జిల్లా కేంద్రం శివారులోని చంపక్‌ హిల్స్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి నుంచి వరంగల్‌కు బీరు సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Samayam Telugu beer bottles load lorry slides from road at champak hills in jangaon
బీరు బాటిళ్ల లారీ బోల్తా..


పెద్ద మొత్తంలో బీరు సీసాలు రోడ్డు పాలవడంతో భారీ నష్టం జరిగింది. స్థానికులెవరూ బీరు బాటిళ్లను తస్కరించకుండా అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.