యాప్నగరం

నేడు భక్త రామదాసు ఎత్తిపోతలు జాతికి అంకితం

ఐదు మండలాల్లో సుమారు 60 వేల ఎకరాలకు సాగునీళ్లు అందించే భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రూ.335.59 కోట్ల వ్యయంతో 11 నెలల్లోనే టీఆర్‌ఎస్ సర్కారు పూర్తిచేసి రికార్డు సృష్టించింది

TNN 31 Jan 2017, 9:30 am
పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. కూసుమంచి మండలం కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:15 గంటలకు తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండా వద్ద పంప్‌హౌస్ నుంచి విడుదలై పరుగులు పెడుతున్న కృష్ణాజలాలకు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుమలాయపాలెంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదళ్ల గుట్ట వద్ద మిషన్‌భగీరథ పనులను పరిశీలిస్తారు.
Samayam Telugu bhakta ramadasu project set for inaugural
నేడు భక్త రామదాసు ఎత్తిపోతలు జాతికి అంకితం


ఐదు మండలాల్లో సుమారు 60 వేల ఎకరాలకు సాగునీళ్లు అందించే భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రూ.335.59 కోట్ల వ్యయంతో 11 నెలల్లోనే టీఆర్‌ఎస్ సర్కారు పూర్తిచేసి రికార్డు సృష్టించింది. దీంతో పాలేరు నియోజకవర్గంలోని భూములు కృష్ణా జలాలతో సస్యశ్యామలం కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.