యాప్నగరం

ఆయనతో అఖిలప్రియ రాజీ అయ్యారా?

బహిరంగ విమర్శలకు దిగిన కర్నూలు జిల్లా టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు.

Samayam Telugu 14 Apr 2018, 5:27 pm
బహిరంగ విమర్శలకు దిగిన కర్నూలు జిల్లా టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. ప్రత్యేకించి భూమా నాగిరెడ్డి బతికున్నంత వరకూ మామా, కోడళ్లుగా సఖ్యతగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియలు ఇటీవలి కాలంలో తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. తీవ్రస్థాయి పదజాలంతో పరస్పరం వీరు విమర్శించుకున్నారు. ఈ క్రమంలో వీరి గొడవ రచ్చకు ఎక్కడంతో చంద్రబాబు వీరిని పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరినీ కూర్చోబెట్టి బాబు రాజీ చేశారు.
Samayam Telugu akhilaav


అయితే ఇలాంటి రాజీలు గతంలో కూడా జరిగాయి. కానీ మళ్లీ వీరిద్దరూ విమర్శించుకున్నారు. తాజా రాజీ భేటీ అనంతరం వీరు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిదాయకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ భేటీపై మంత్రి అఖిలప్రియ అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు కానీ, ఏవీ సుబ్బారెడ్డి మాత్రం మాట్లాడారు. తామిద్దరి మధ్యనా విబేధాలున్న మాట వాస్తవమే అని ఏవీ స్పష్టం చేశారు. అందుకే బాబు పిలిపించుకుని మాట్లాడారన్నారు. ఇద్దరూ సర్దుకుపోవాలని, విమర్శలు మానాలని చంద్రబాబు తమకు సూచించారని.. ఆ మేరకు తాము నడుచుకుంటామని ఏవీ ప్రకటించారు.

అయితే కొన్ని అంశాల విషయంలో మాత్రం ఏవీ సుబ్బారెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. అఖిలప్రియకు ఇగో ఎక్కువ అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. ఆమె తనను చీడపురుగు అని అనాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో నంద్యాల లేదా ఆళ్లగడ్డ నుంచి తను పోటీ చేయబోయే అంశం గురించి తను ఇప్పుడేం మాట్లాడను అని ఏవీ అన్నారు. తనను ఆళ్లగడ్డకు వెళ్లవద్దని చంద్రబాబు ఆదేశించింది అబద్ధమని, అలాంటిదేమీ లేదని ఏవీ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.