యాప్నగరం

హైకోర్టు విభజనపై సుప్రీంలో విచారణ.. ఏపీ తీరుపై కేంద్రం, తెలంగాణ అభ్యంతరాలు

మూడేళ్లగా అదే మాట చెబుతున్నారు.. హైకోర్టు ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణాలేంటి.. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చెయ్యండి..

Samayam Telugu 1 Oct 2018, 2:11 pm
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో సోమవారం (అక్టోరబ్ 1న) విచారణ జరిగింది. నూతన హైకోర్టు ఎప్పటికి సిద్ధమవుతుందని.. ఆంధ్రప్రదేశ్ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ లాయర్ నారీమన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని ఆయన తెలియజేయగా.. మూడేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలంగాణ, కేంద్రం తరఫున వాదనలు వినిస్తున్న న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలస్యానికి కారణమేంటని ప్రశ్నించారు.
Samayam Telugu SC.


నిధులు కొరత వల్లే హైకోర్టు భవన నిర్మాణం ఆలస్యమయ్యిందని లాయర్ నారీమన్ కోర్టుకు విన్నవిచారు. అయితే కేంద్రం ఏపీకి రూ.2500 కోట్లు మంజూరు చేసిందని.. ఆ నిధుల్లో కొంత హైకోర్టుకు కేటాయించినట్లు కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన నారీమన్.. భవనం నిర్మాణ దశలో ఉందని.. డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. దీంతో హైకోర్టు భవనం ఎప్పటిలోగా పూర్తి అవుతుందో అఫిడవిట్ రూపంలో.. రెండు వారాల్లోగా కోర్టులో దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.