యాప్నగరం

బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి: చంద్రబాబు

అత్యవసర సేవలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని ఏపీ సీఎం చంద్రబాబు

Samayam Telugu 26 May 2017, 2:34 pm
అత్యవసర సేవలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో తాను, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సహా ఇతర అధికారులూ బయోమెట్రిక్ హాజరువిధానాన్ని పాటించాల్సిందేనని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన విజయవాడలో జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు.
Samayam Telugu biometric attendance mandate for emergency services says chandrababu
బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి: చంద్రబాబు


ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్రజాసాధికార సర్వేలపై బాబు సమీక్ష నిర్వహించారు. పీపుల్స్ హబ్ సాఫ్ట్ కాపీని సీఎం ఆవిష్కరించారు. ప్రజాసాధికార సర్వే వివరాలను ప్రభుత్వం పీపుల్స్ హబ్ పేరిట భద్రపరిచింది. ఈ సర్వే 80శాతం పూర్తయినట్లు బాబు చెప్పారు. మూడు నెలల్లో మిగతాది పూర్తి చేస్తామని తెలిపారు.

వైద్యుల కొరత గ్రామీణ ప్రాంతాల్లో లేకుండా చూడాలని చెప్పిన చంద్రబాబు.. తన గ్రామంలోనూ వైద్యుల కొరత ఉందని...ఔట్ సోర్సింగ్ విధానంలో వైద్యులను నియమించుకోవాలని సంబంధిత శాఖను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.