యాప్నగరం

టీడీపీ నేతలతో భేటీ వాయిదా, అమిత్ షా ఇస్తోన్న సంకేతాలేంటి?

టీడీపీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ వాయిదా పడింది. కీలకమైన ఈ సమావేశాన్ని వాయిదా వేయడం వెనుక అమిత్ షా వ్యూహాలేంటి?

TNN 31 Jan 2018, 1:12 pm
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇందుకోసం పునర్విభజన బిల్లుకు సవరణలు చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ విషయమై చర్చించేందుకు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, తోట నర్సింహంతో మంగళవారం అమిత్ షా భేటీ కావాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా ఈ సమావేశాన్ని వాయిదా వేసిన ఆయన.. ఢిల్లీకి రమ్మంటూ తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు కబురు పంపారు.
Samayam Telugu bjp chief amit shah puts off tdp mps meet
టీడీపీ నేతలతో భేటీ వాయిదా, అమిత్ షా ఇస్తోన్న సంకేతాలేంటి?


అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన తెరమీదకు వచ్చిన నాటి నుంచి ఇది తమకు ఏ విధంగా ఉపయోగ పడుతుందనే దిశగానే అమిత్ షా ఆలోచనలు సాగుతున్నాయి. ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎంల నుంచి నియోజకవర్గాల పెంపు విషయమై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన తమ మిత్రపక్షం టీడీపీతో భేటీ కావాలని భావించారు. కానీ ఈలోగానే మనసు మార్చుకున్నారు.

ఫిబ్రవరి 1న తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్ రెడ్డిలతోపాటు ఇతర నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు తమకు ఉపయోగడుతుందో వీరు అమిత్ షాతో చర్చించనున్నారు. ఏపీ బీజేపీ నాయకులు ఢిల్లీ బాట పట్టనున్నారు. అమిత్ షా వైఖరి చూస్తుంటే.. కమలం పార్టీ ప్రయోజనాలు ఫస్ట్, మిత్ర పక్షాలు నెక్స్ట్ అన్నట్టుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో టీడీపీ నేతలతో భేటీని అమిత్ షా వాయిదా వేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.