యాప్నగరం

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీజేపీ మండిపాటు!

ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల రాజకీయ ఫిరాయింపులపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ

TNN 28 Nov 2017, 8:06 am
ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల రాజకీయ ఫిరాయింపులపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. ఏ కారణం చేత అయినా ఎమ్మెల్యేలు పార్టీలు మారడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు తమ పదవికి కూడా రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొనాలి అని ఆయన సూచించారు. అలాగాక.. సాకులు చెప్పి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరిపోవడం అవకాశవాదం అవుతుంది అని ఆయన అన్నారు.
Samayam Telugu bjp condomen political defections
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీజేపీ మండిపాటు!


‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి.. అని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. మరి వారి మనోభావాలు గాయపడ్డాయి సరే, ప్రజల మనోభావాల పరిస్థితి ఏమిటి? ప్రజలు ఈ ఎమ్మెల్యేలను ఏ పార్టీ తరఫున ఎన్నుకున్నారు? ఏ పార్టీకి ఓటు వేస్తే వీళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు? ఆ విషయాన్ని పక్కన పెట్టి పార్టీ ఫిరాయించడం అంటే.. ప్రజల మనోభావాలను గాయపరచడం కాదా?’ అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

ఏపీలో రాజకీయ ఫిరాయింపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో ఆ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఫిరాయింపులను తప్పు పడుతోంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల మనోభావాలకు కూడా గౌరవం ఇవ్వాలని కమలం పార్టీ నేత అన్నారు. అయితే.. ఎన్ని విమర్శలు వస్తున్నా, ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం లెక్క చేయనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.