యాప్నగరం

కిరణ్‌కుమార్ రెడ్డికి మళ్లీ గాలమేస్తున్నారా?

ఎన్నికలు అయిపోయింది హద్దు కిరణ్ మళ్లీ రాజకీయం గురించి మాట్లాడటం లేదు. సొంత నియోజకవర్గంలో తమ్ముడే ఓటమి పాలవ్వడం కిరణ్ కు ఎదురుదెబ్బ

TNN 2 Nov 2017, 10:43 am
ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి హోదా అనే శాశ్వత కీర్తి కూడా కిరణ్ కే. రాష్ట్రవిభజన ఖరారు అయ్యాకా కాంగ్రెస్ అధిష్టానంపై కిరణ్ తిరుగుబాటు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేశారు, కొత్త పార్టీ పెట్టారు, అయితే అందుకు తగ్గ ప్రజామోదాన్ని పొందలేకపోయారు. విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ ని పెట్టడం, అప్పటి వరకూ పదవిని అనుభవించి చివరి నిమిషంలో బయటకురావడం.. వంటి కారణాల చేత కిరణ్ సక్సెస్ కాలేకపోయారు. వీటన్నింటికీ మించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన నేత కాకపోవడం.. అధిష్టానం నియమించిన సీఎం వంటి కారణాల చేతకూడా ఈయన సొంత పార్టీ సక్సెస్ కాలేకపోయింది.
Samayam Telugu bjp invites kiran kumar reddy
కిరణ్‌కుమార్ రెడ్డికి మళ్లీ గాలమేస్తున్నారా?


ఎన్నికలు అయిపోయింది హద్దు కిరణ్ మళ్లీ రాజకీయం గురించి మాట్లాడటం లేదు. సొంత నియోజకవర్గంలో తమ్ముడే ఓటమి పాలవ్వడం కిరణ్ కు ఎదురుదెబ్బ అయ్యింది. అయితే ఏపీలో కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బలపడాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీలు మాత్రం అడపాదడపా కిరణ్ ను కదిలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయనను తిరిగి చేర్చుకోవడానికి కాంగ్రెస్ ఆసక్తితోనే ఉంది. ఇక బీజేపీ కూడా ఆయనను చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పుడు వెళ్లి కాంగ్రెస్ లోకి చేరితే కిరణ్ కు దక్కేది ఏమీ లేదు. బీజేపీ అయితే కనీసం రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వగలదు.

అయినప్పటికీ కిరణ్ ను బీజేపీలోకి రానీయకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. కిరణ్ కు కమలం పార్టీ మళ్లీ గాలం వేస్తోందట. ఆయనను చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోందట. ఇటీవల చిత్తూరు జిల్లాకు వెళ్లిన బీజేపీ నేత పురందేశ్వరి అక్కడ కిరణ్ తో సమావేశం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి చేరమని ఆమె ఆయనను ఆహ్వానించారట. గతలంలో వీరిద్దరూ కాంగ్రెస్ లో పని చేసిన వారే. మరి కిరణ్ బీజేపీలో చేరాలంటే.. తక్షణం రాజ్యసభ సభ్యత్వం గట్రా ఆశించవచ్చు. బీజేపీ అలాంటి అవకాశం ఇచ్చి ఆయనను పార్టీలో చేర్చుకుంటుందేమో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.