యాప్నగరం

సీఎం జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపీ నేత పురందేశ్వరి. విశాఖలో చర్చిలకు భద్రత కల్చించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు. గోదావరి జలాల తరలింపుపై అఖిలపక్షం నిర్వహించాలని సూచన.

Samayam Telugu 18 Jul 2019, 8:15 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత పురందేశ్వరి. విశాఖలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలివ్వడం సరికాదన్నారు. ఇలా ఒక మతాన్నో ఒక కులాన్నో కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరించడం సమాజంలో ఘర్షణ వాతావరణానికి కారణమవుతుందని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో జరిగిన బీజేసీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu jagan.


టీడీపీ హయాంలో కులాలు, కార్పొరేషన్ల పేరుతో విభజన రాజకీయాలు చేశారని.. ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు పురందేశ్వరి. వైసీపీ ప్రభుత్వం కూడా తమ తీరు మార్చుకోవాలన్నారు. ఏపీకి కేంద్రం ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలదని.. హోదా సాధ్యం కాదన్నారు పురందేశ్వరి. తెలంగాణతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై అఖిలపక్షం నిర్వహించాకే సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇక మోదీ స్కూటీ యోజన పథకం పేరుతో జరుగుతున్న ప్రచారంపైనా పురందేశ్వరి స్పందించారు. సోషల్ మీడియాలో టెన్త పాసైన విద్యార్థినిలకు స్కూటర్లు ఇస్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని.. దాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. ఒకవేళ అలాంటి పథకాలేవైనా అమలు చేయాలని కేంద్రం భావిస్తే.. ప్రధాని స్వయంగా ప్రకటిస్తారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.