యాప్నగరం

ఏపీ మంత్రివ‌ర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా

మోదీ మంత్రివ‌ర్గం నుంచి టీడీపీ మంత్రులు త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఏపీ మంత్రివ‌ర్గంలో భాజ‌పా మంత్రులు సైతం రాజీనామాలు స‌మ‌ర్పించాల‌ని నిర్ణ‌యించారు

TNN 8 Mar 2018, 10:39 am
మోదీ మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏపీ మంత్రివర్గంలో భాజపా మంత్రులు సైతం రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించారు. అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్కు రాజీనామా లేఖలతో మంత్రి కామినేని, దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు వెళ్లారు. అయితే మంత్రివర్గంలో తమకు స్థానం ఇచ్చినందుకు ఇద్దరు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ పదవుల్లో బాగా పనిచేశారని ఇద్దరు మంత్రులకు చంద్రబాబు కితాబు ఇచ్చినట్లు సమాచారం.
Samayam Telugu ఏపీలో భాజ‌పా మంత్రులు
BJP ministers in AP cabinet

ఈ రోజు అసెంబ్లీలో రాజీనామా సందర్భంగా భాజపా మంత్రులు

బీజేపీ మంత్రులు అధికార వాహనాలను, ఐడీ కార్డులను వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్న క్రమంలో ఏపీ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు అధిష్టానం ఆదేశాలతో బీజేపీ మంత్రులు ముందుకువెళ్లారు. అనుకున్న విధంగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే సభలోనే మంత్రులు కామినేని, మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.