యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యేని కలిసింది నిజమే.. కాని: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల

ఢిల్లీలో టీడీపీపై కుట్ర జరుగుతోందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. అమిత్‌ షా, రామ్‌మాధవ్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గనతో కలవలేదని చెప్పారు.

Samayam Telugu 15 Jun 2018, 11:37 am
ఢిల్లీలో టీడీపీపై కుట్ర జరుగుతోందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. అమిత్‌ షా, రామ్‌మాధవ్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గనతో కలవలేదని చెప్పారు. 'నేను వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన మాట నిజమే.. శాంగ్రీ హోటల్‌లో లంచ్ కూడా చేశాం. ఒకే కారులో ఏపీ భవన్‌కు వచ్చాం. అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఎవరైనా రావొచ్చు.. దీన్ని రాజకీయం చేయడం సరికాదు. తాము అమిత్ షా, రామ్ మాధవ్‌ను కలిసినట్లు నిరూపిస్తే.. ఏ ఛాలంజ్‌కైనా రెడీ. టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఢిల్లీ స్థాయి నేతలు ఎవర్నీ కలవలేదు' అని చెప్పుకొచ్చారు.
Samayam Telugu Akula SatyaNarayana


నిన్న మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథ్ రెడ్డిలు ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రామ్‌ మాధవ్‌లను కలిశారని ఆరోపించారు. వైసీపీతో కుమ్మకై బీజేపీ ధైర్యంగా ఏపీపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి వైసీపీ సిస్టర్ పార్టీ అంటూ ఆరోపించారు. అటు టీడీపీ నేతల నుంచి విమర్శలు రావడంతో.. ఆకుల సత్యనారాయణ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.