యాప్నగరం

అసెంబ్లీలో నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే

నేడు ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న 2వ రోజు సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే...

Samayam Telugu 7 Mar 2017, 1:05 pm
నేడు ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న 2వ రోజు సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అధ్యక్ష స్థానంలో కూర్చున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గురించి చేసిన పలు వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. సభాధ్యక్షుల వారు ఉన్నతస్థానానికి ఎదిగారని, ఎవరికీ అందనంత ఎత్తులో అధ్యక్షులు వున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యల వెనుకున్న మర్మం ఏంటో అర్థం కాకపోవడంతో మొదట స్పీకర్ కోడెల, సీఎం చంద్రబాబు సహా మిగతా సభ్యులంతా అలా ఆయనవైపే చూస్తూ వుండిపోయారు.
Samayam Telugu bjp mla vishnukumar raju funny comments on ap speaker kodela shivaprasad rao
అసెంబ్లీలో నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే


ఇంతలోనే తన మాటల వెనుకున్న అర్థం ఏంటో అందరికీ విడమర్చి చెప్పారు విష్ణుకుమార్ రాజు. "కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీలో గతానికి భిన్నంగా మీ (స్పీకర్) స్థానాన్ని సభ్యులెవ్వరికీ అందనంత ఎత్తులో ఏర్పాటు చేసి, అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టడం బాగుంది. ఇక మీ వరకు ఎవ్వరూ రాలేరు అధ్యక్షా" అని ఎమ్మెల్యే చెప్పడంతో అప్పటివరకు ఏమీ అర్థం కాని వాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. గతంలో ఎవరైనా ఏదైనా చెప్పాలంటే మైక్ పట్టుకుని ఊపేసేవాళ్లు. కానీ ఇప్పుడా అవకాశం లేదు. అలాగే సభ నుంచి వాకౌట్ చేయాలనుకునే సభ్యులకి ఎటువైపు వెళ్లాలో కూడా అంతుచిక్కడం లేదు అధ్యక్షా అని చెప్పి సభ్యులని నవ్వించారు విష్ణుకుమార్ రాజు. అప్పటికే ప్రభుత్వం వైఖరిపై నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి వున్నారు.

హుదూద్ తుపాన్ కారణంగా అనకాపల్లిలోని బెల్లం పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, ఫ్యాక్టరీ అభివృద్ధికి అవసరమైన రూ. 30 కోట్లు కేటాయించి ఆ ప్రాంతంలోని లక్ష మంది రైతులకి మేలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే క్రమంలో విష్ణు కుమార్ రాజు సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.