యాప్నగరం

టీడీపీ నేతలపై ఎంపీ జీవీఎల్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

టీడీపీ నేతలు తనను బెదిరించారంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నేతలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీనిపై జీవీఎల్ ట్వీట్ చేశారు.

Samayam Telugu 31 Jul 2018, 8:02 am
టీడీపీ నేతలు తనను బెదిరించారంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నేతలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీనిపై జీవీఎల్ ట్వీట్ చేశారు. ‘టీడీపీ నేతలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు రాజ్యసభ సెక్రటేరియట్‌కు అందజేశాను. రాజ్యసభలో నా ప్రసంగం తర్వాత వాళ్లు నన్ను బెదిరించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా నోటీసులతో పాటూ అందజేశాను’ అన్నారు.
Samayam Telugu Gvl


నోటీసుల్లో టీడీపీ నేత బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనంద్ సూర్య, ఈమని సత్యనారాయణ పేర్లను జీవిఎల్ ప్రస్తావించారు. వారి ప్రెస్‌మీట్లు పెట్టి తనను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పారు. టీడీపీ వైఫల్యాలను రాజ్యసభలో ఎండగట్టడం వల్లే తనను ఇలా చేస్తున్నారని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. తన విజ్ఞ‌ప్తిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.