యాప్నగరం

మన ‘గ్లోబల్‌ లీడర్‌’ఎక్కడ ప్రసంగిస్తున్నట్టు: జీవీఎల్

ఐక్యరాజ్యస సమితి వెబ్‌సైట్‌లో నమోదైన 313 ఈవెంట్లలో బాబుగారి ప్రసంగం గురించి లేదు.. కావాలంటే వెతుక్కోవచ్చు.. ఇంతకు ‘మన గ్లోబల్‌ లీడర్‌’ ఏ సదస్సులో మాట్లాడుబోతున్నారు.

Samayam Telugu 24 Sep 2018, 2:13 pm
అమెరికా పర్యటనలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. న్యూయార్క్‌లో ఇవాళ (సెప్టెంబర్ 24న) జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో నిర్వహిస్తోన్న ‘ఫైనాన్సింగ్ సస్టెయినబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజస్ అండ్ ఆపర్చ్యునిటీస్’ అనే సదస్సులో సీఎం ప్రసంగించబోతున్నారు. అయితే బాబు అమెరికా పర్యటన, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
Samayam Telugu GVL


ఐక్యరాజ్యస సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న 313 అనుబంధ కార్యక్రమాల్లో చంద్రబాబు ప్రసంగించే ఈవెంట్ లేదంటున్నారు జీవీఎల్, చంద్రబాబు ప్రసంగించబోయే యూఎన్‌ఈపీ ఈవెంట్‌ను.. యూఎస్ఈపీ, బీఎన్‌పీ బరిబాస్, వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ నిర్వహిస్తాయన్నారు. కాని అనుబంధ కార్యక్రమాల జాబితాలో ఇది ఎందుకు నమోదు కాలేదన్నారు. ఒకవేళ ఉంటే లింక్‌ను షేర్‌ చేయాలన్నారు.

అంతేకాదు ఐక్యరాజ్యస సమితి వెబ్‌సైట్‌లో నమోదైన 313 ఈవెంట్లలో లేదని.. కావాలంటే వెతుక్కోవచ్చని.. ఇంతకు ‘మన గ్లోబల్‌ లీడర్‌’ చంద్రబాబు ఏ సదస్సులో మాట్లాడుబోతున్నారని ప్రశ్నించారు జీవీఎల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.