యాప్నగరం

బాబు అబద్ధాల రాయుడు.. జగన్‌పై దాడి కేసు పక్కదారి పట్టిస్తున్నారు: జీవీఎల్

జగన్‌పై జరిగిన దాడి ఘటనలో ఎయిర్‌పోర్టు కేంద్రం పరిధిలో ఉందని చెప్పి.. ఇప్పుడు మాట ఎందుకు మార్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ అంటే టీడీపీకి ఎందుకు భయం..

Samayam Telugu 29 Oct 2018, 3:36 pm
ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి రాజకీయ కుట్రే అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విజయవాడలో మాట్లాడిన జీవీఎల్.. జగన్‌పై దాడి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై స్పందించారు. జగన్‌పై జరిగిన దాడి హత్యాయత్నంలో భాగమేనని.. పోలీసులు రిపోర్ట్‌లో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ టీడీపీ చెబుతున్నది దానికి.. రిపోర్ట్‌ విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కేసు దర్యాప్తును ఎందుకు తప్పుదారి పట్టించారో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
Samayam Telugu Gvl.


జగన్‌పై దాడి ఘటనను పక్క వారిపై తోసేసి.. రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు జీవిఎల్. జగన్‌పై దాడితో లాభం ఎవరికి లాభం.. దాడి ఎవరు చేయించారు.. ఎందుకు చేయించారన్నది విచారణలో తేల్చాలి తప్ప.. నిందితుడు ఏ పార్టీ.. ఏ ప్లెక్సీ పెట్టుకున్నాడనేది ముఖ్యం కాదన్నారు. ఈ కేసులో వైసీపీ కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించమంటే భయమెందుకన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. భంగపడి తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు జీవీఎల్. బాబు అబద్ధాల రాయుడిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనలో ఎయిర్‌పోర్టు కేంద్రం పరిధిలో ఉందని చెప్పి.. ఇప్పుడు మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

ఐటీ సోదాలంటే టీడీపీ నేతలకు భయమెందుకు పట్టుకుందన్నారు జీవీఎల్. పన్నులు ఎగ్గొట్టి, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిపై ఐటీ దాడులు జరుగుతాయని.. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఐటీ దాడుల విషయంలో మీసం మెలేసి మాట్లాడిన రమేష్.. ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రెండు రోజులుగా ఆయన కనిపించడం లేదని.. ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలంటూ సెటైర్లు పేల్చారు. సీఎం రమేష్‌ ఆంధ్రా మాల్యాగా పోలుస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.