యాప్నగరం

కేసీఆర్ లాంటి అవినీతి సీఎంను చూడలేదు!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

TNN 22 Oct 2017, 3:08 pm
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి పాలన అవినీతిమయమని, కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకు తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, కేసీఆర్ లాంటి అవినీతి సీఎంను చూడలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పార్టీ అని, ట్రాక్టర్లు, గొర్రెలు, బర్రెలు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని నాగం ఆరోపించారు. బీజేపీ మద్దతిస్తేనే తెలంగాణ వచ్చింది తప్పా, కేవలం కేసీఆర్ ఒక్కరి వల్లే ఈ రాష్ట్రం ఏర్పడలేదని ఆయన మండిపడ్డారు.
Samayam Telugu bjp senior leader nagam janardhan reddy fires on telangana cm
కేసీఆర్ లాంటి అవినీతి సీఎంను చూడలేదు!


ఇదిలా ఉండగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఇప్పటికే అధిష్టానంతో సంప్రదింపులు పూర్తి చేశారని, రేవంత్‌తో పాటు మరికొందరు టీటీడీపీ నేతలు కూడా ఆయన వెంట వెళతారని వార్తలు వస్తున్నాయి. ఇక బీజేపీలో తగిన గుర్తింపు లేదనే బాధలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నాగం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. అనంతర పరిణామాల్లో ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.