యాప్నగరం

తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ

మొన్న ఉత్తర్ ప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధించిన నేపథ్యంలో..తెలంగాణ

Samayam Telugu 25 Mar 2017, 5:18 pm
మొన్న ఉత్తర్ ప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధించిన నేపథ్యంలో..తెలంగాణ బీజేపీ నేతలు కూడా మోదీ చరిష్మా వాడుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం కోసం వ్యూహరచన చేస్తున్నారు.
Samayam Telugu bjp will contest alone in telangana says dr laxman
తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ


2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్మంగా పనిచేస్తామని....త్వరలోనే నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదియే బ్రహ్మస్త్రం అని లక్ష్మణ్ అన్నారు. ఇకపై ప్రతి ఎన్నికల్లో బీజేపీ బరిలో ఉంటుందని చెప్పిన ఆయన... మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో మతరాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.