యాప్నగరం

టీడీపీకి ఎదురుదెబ్బ: గోరంట్ల రాజీనామా

ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవులు దక్కనివారు అలకపాన్పు ఎక్కారు. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి

Samayam Telugu 2 Apr 2017, 5:35 pm
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవులు దక్కనివారు అలకపాన్పు ఎక్కారు. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి మంత్రివర్గంలో చోటు దక్కని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగానే.. మాజీ మంత్రి, సీనియర్ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా చంద్రబాబుకు, మీడియాకు విడుదల చేశారు.
Samayam Telugu blow to tdp gorantla buchaiah resigns for party post
టీడీపీకి ఎదురుదెబ్బ: గోరంట్ల రాజీనామా


2014 అసెంబ్లీ ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పార్టీని నమ్ముకున్న వారికి, త్యాగాలు చేసిన వారికి పదవులుకు దక్కడం లేదని..ఆయారాం.. గయారాంలకు పదవులు దక్కుతున్నాయని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఈ సారి మంత్రి దక్కకపోవడం అన్యాయమని అన్నారు. పార్టీలు మారిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలోనే కొనసాగుతూ ఉన్నానని... అనేక సంక్షోభాల్లోనూ పార్టీకి సేవలు చేశానని గోరంట్ల చెప్పారు.

మంత్రి పదవులు ఆశించి వారిలో బొండా ఉమ, దూళిపాళ్ల నరేంద్, చింతమనేనని ప్రభాకర్, బండారు సత్యనారాయణ లాంటి కూడా ఉన్నారు. అయితే వీళ్లందరితో బాబు మాట్లాడినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.