యాప్నగరం

వీడియో: శ్రీకాకుళం తీరంలో మత్స్యకారులు గల్లంతు

చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తోన్న మత్స్యకారులు ప్రయాణిస్తోన్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం తీరంలో శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

Samayam Telugu 21 Jul 2018, 1:18 pm
చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తోన్న మత్స్యకారులు ప్రయాణిస్తోన్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం తీరంలో శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పది రోజుల కిందట విజయనగరానికి చెందిన కొందరు మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్ తీరానికి చేపల వేటకు వెళ్లారు. ఇంతలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. దీంతో వేటకు వెళ్లిన వీరంతా తమ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి చేరుకోవడానికి ప్రయాణిస్తుండగా శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. ఓ రాకాసి అల విరుచుకుపడటంతో వీరు ప్రయాణిస్తు పడవ ఒక్కసారిగా ఒరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది.
Samayam Telugu సముద్రంలో పడవ బోల్తా


దీంతో పడవలోని ఎనిమిది మంది మత్స్యకారులు సముద్ర జలాల్లో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురిని నావికా దళ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఐదుగురు ఏమయ్యారనే విషయం ఇంకా తెలియరాలేదు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.