యాప్నగరం

లభించని లాంచీ ఆచూకీ.. ముమ్మర గాలింపు

Samayam Telugu 16 May 2018, 8:08 am
మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ బోల్తా పడిన విషయం తెలిసిందే. మునిగిపోయిన ప్రాంతంలో లాంచీ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మంటూరు వద్ద లాంచీ ఉన్నట్టు తొలుత భావించినా, అక్కడ కూడా దాని ఆచూకీ దొరకలేదు. అర్థరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా ఆచూకీ మాత్రం దొరకలేదు. తిరిగి నేటి ఉదయం సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో బోటును వెలికితీసేందుకు నేవీ కూడా రంగంలోకి దిగారు. ఎన్టీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ బృందాలు బోటును గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారి కోసం అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో గజ ఈతగాళ్లు గాలించారు.
Samayam Telugu గోదావరిలో పడవ బోల్లా


బుధవారం ఉదయం మరో 20 మంది గజ ఈతగాళ్లను తీసుకొచ్చి గాలింపు ముమ్మరం చేశారు. మూడు నేవీ హెలికాప్టర్లు సైతం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. లాంచీ బయలుదేరిన కొద్దిసేపటికే బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయానికి లాంచీలో దాదాపు 50 మంది ఉన్నారని, బోల్తా పడటంతో 40 మందికి పైగా గల్లంతయ్యారని కొందరు చెబుతుంటే, పదిమంది వరకే జలసమాధి అయి ఉంటారని మరికొందరు చెబుతున్నారు. దీంతో ప్రమాద తీవ్రత అంచనాలకు అందనిదిగా ఉంది. ఈ ప్రమాదం నుంచి దాదాపు 16 మంది సురిక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. వీరిలో కొందరు పశ్చిమగోదావరి జిల్లా వైపు చేరుకోగా...మరికొందరు తూర్పుగోదావరి జిల్లా వైపు చేరారు.

లాంచీ ఓనర్, డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయారు. లాంచీలో మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నట్టు ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు చెబుతున్నారు. వర్షం వల్ల లోపల ఉండే సిమెంటు బస్తాలు తడిపోతాయానే ఉద్దేశంతో లాంచీ తలుపులు మూసేయడంతో ప్రమాదసమయంలో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.