యాప్నగరం

​తెలుగుదేశానికి రాజీనామా పై ఎల్లుండి చెబుతా..!!

ప్రస్తుతం కార్యకర్తలతో, తన అనుచరులతో ఈ అంశంపై చర్చిస్తున్నాను అని బొజ్జల తెలిపారు.

TNN 13 Apr 2017, 2:56 pm
మంత్రి పదవి నుంచి తనను తొలగించడం పట్ల బాధతో ఉన్నాను అని మరోసారి స్పష్టం చేశారు తెలుగుదేశం నేత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి. చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల ఇటీవల జరిగిన ఏపీ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో పదవి కోల్పోయారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కేబినెట్ నుంచి తొలగించిన ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, అసెంబ్లీ స్పీకర్ కు పంపించారు. అయితే అది ఆమోదించలేదు.
Samayam Telugu bojjala responds on resignation
​తెలుగుదేశానికి రాజీనామా పై ఎల్లుండి చెబుతా..!!


ఆ తర్వాత బొజ్జలను చల్లార్చడానికి పార్టీ నేతలను శ్రీకాళ హస్తి పంపించారు చంద్రబాబు. అప్పుడు కూడా బొజ్జల కుటుంబీకులు అసంతృప్తితోనే కనిపించారు. దూతలుగా వచ్చిన వారిపై కూడా బొజ్జల సతీమణి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి మంత్రి పదవి పోవడం గురించి బొజ్జల కుటుంబం అంతటితో చల్లబడింది అనుకుంటే.. తాజాగా మరోసారి బొజ్జల రాజీనామా ప్రతిపాదన తెచ్చారు. ఈ అంశంపై ఎల్లుండి తుది నిర్ణయం ప్రకటిస్తాను అని బొజ్జల అన్నారు. అనగా.. ఈ నెల పదిహేనవ తేదీ తన తుది నిర్ణయాన్ని తెలియ జేస్తానని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కార్యకర్తలతో, తన అనుచరులతో ఈ అంశంపై చర్చిస్తున్నాను అని బొజ్జల తెలిపారు. ఎల్లుండి ఏదో ఒక విషయాన్ని ప్రకటిస్తానని ఆయన తెలిపారు. బొజ్జలను మంత్రి పదవి నుంచి తొలగించినా.. ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. రాజీనామా వద్దని మధ్యవర్తులు బొజ్జలను ఆ పదవి హామీతో బుజ్జగించారని సమాచారం. సలహాదారు పదవికి కూడా కేబినెట్ ర్యాంకు ఇస్తామన్నారట. అయితే తుదినిర్ణయాన్ని 15 వ తేదీన ప్రకటిస్తానని బొజ్జల చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ చిత్తూరు జిల్లా సీనియర్ నేత రాజకీయ సంచలనాన్ని సృష్టిస్తారా లేక రాజీ పడతారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.