యాప్నగరం

ఢిల్లీలో ఘనంగా బోనాలు.. బోనమెత్తిన కేంద్ర మంత్రి

ఢిల్లీ ప్రజలు ఇండియా గేట్ వద్ద బోనాల సంబురాలను ఆసక్తిగా చూశారు. ఒగ్గుడోలు దరువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఢిల్లీవాసులను బాగా ఆకట్టుకున్నాయి.

TNN 27 Jun 2017, 5:15 pm
ఢిల్లీలో మహంకాళి బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో బోనాల వేడుకలో మంగళవారం (జూన్ 27) కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. మహంకాళి అమ్మవారికి కేంద్రం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు సంప్రదాయ పండుగలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న అధికారులకు, ఆలయ కమిటీ నిర్వాహకులకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి తెచ్చిన బంగారు బోనాన్ని కాళికామాతకు సమర్పించారు.
Samayam Telugu bonalu celebrations at telangana bhavan in new delhi
ఢిల్లీలో ఘనంగా బోనాలు.. బోనమెత్తిన కేంద్ర మంత్రి


ఢిల్లీలో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల పండుగ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ ఉత్సవాలను ఇండియా గేట్ సమీపంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ ప్రారంభించారు. వంద మంది మహిళలు బోనాలు ఎత్తుకొని ఇండియా గేట్ నుంచి ఊరేగింపుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

రంజాన్ సందర్భంగా సోమవారం సెలవు రోజు కావడంతో ఢిల్లీ ప్రజలు ఇండియా గేట్ వద్ద బోనాల సంబురాలను ఆసక్తిగా చూశారు. ఒగ్గుడోలు దరువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఢిల్లీవాసులను బాగా ఆకట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.